Premium Only Content

అల్లం రసం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!
అల్లం రసం తాగితే.. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!
అల్లం రసం తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
అల్లం రసం తాగితే.. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!
సంప్రదాయ వంటల నుంచి ఆధునిక రుచుల వరకూ దాదాపు చాలావరకు వంటల్లో మనం అల్లం వాడుతుంటాం. అల్లంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు బి3, బి6, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు తో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో జింజరాల్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి
అల్లం రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అల్లం రసం ఎలా తయారు చేసుకోవాలి, తరచు అల్లం రసం తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం,
ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది..
అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో జింజరాల్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అల్లంలో రోగనిరోధక పనితీరును మెరుగుపరిచే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది జలబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
పరగడుపునే అల్లం రసం తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి, గుండె పనితీరు మెరుగవుతుంది గుండె సమస్యలు రావు, శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అల్లం రసాన్ని రెండు స్పూన్లు వేడి నీటిలో కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి శరీరానికి కావల్సిన జింక్, మెగ్నిషియం, పొటాషియంలు అల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గిస్తాయి. గ్యాస్, అసిడిటీ పోతాయి, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది, టాక్సిన్లుతొలగిపోతాయి,
అధికంగా చేరే నీటిని తొలగిస్తుంది
శరీరంలో అధికంగా చేరే నీటిని తొలగిస్తుంది, పరగడుపునే అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటికి వెళ్లిపోతుంది, అలసట, నీరసం తొలగిపోతాయి, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, ఫ్లూ తగ్గిపోతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అల్లంలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి..
అల్లం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది..
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో మంట, జలుబు, దగ్గు, వైరల్ సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి, దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడతాయి. శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి..
అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అల్లంలో ఉండే.. జింజెరోల్స్లోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. శరీంలోని మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో సహజంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులూ, నొప్పుల్ని అదుపులో ఉంచుతాయి.
బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి..
అల్లంలోని ఔషధ గుణాలు.. ఇన్సులిన్ విడదలకు, సెన్సిటివిటీకి సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి తోడ్పడతాయి. డయాబెటిస్ ఉన్నవారు రోజూ అల్లం రసం తాగితే మేలు జరుగుతుంది.
గుండెకు మంచిది..
అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. ఈ కారకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె సమస్యలు వచ్చే ముప్పును తగ్గిస్తాయి.
నెలసరిలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది..
నెలసరి సమయంలో అల్లం రసం తీసుకోవడం వల్ల అప్పుడు వచ్చే నొప్పులు నియంత్రణలో ఉంటాయి. అధిక రక్తస్రావాన్ని అరికట్టే సుగుణాలు దీనిలో ఉన్నాయని చెబుతున్నాయి పలు అధ్యయనాలు.
మెదడు పనితీరు మెరుగుపడుతుంది..
అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడతాయి. వయస్సు-సంబంధిత అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. తరచు అల్లం రసం తీసుకుంటే.. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గుతారు..
రోజూ అల్లం రసం తాగితే.. బరువు కంట్రోల్లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. అల్లం జీవక్రియను పెంచుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువును కంట్రోల్లో ఉంచుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
-
SpartakusLIVE
6 hours ago$120,000 WZ Tourney || #1 Tournament Champion RETURNS
8.38K -
47:47
Athlete & Artist Show
6 hours ago $0.51 earnedSeason 6 Premiere, NHL Season Preview!
7.03K2 -
17:17
Advanced Level Diagnostics
20 days ago $0.36 earnedWhy won't this Mack Truck Charge!
5.06K1 -
1:33:51
Steve-O's Wild Ride! Podcast
16 days ago $11.53 earnedJohn C. Reilly's Surprising Connection To Jackass (And Beef With Weeman!)
105K21 -
LIVE
StoneMountain64
3 hours agoBattlefield 6 Unlocks and Challenges
82 watching -
LIVE
Total Horse Channel
11 hours agoLow Roller Reining Classic | Main Arena | October 11th, 2025
148 watching -
LIVE
GamerGril
4 hours agoZombie Fight Club 💞Dying Light The Beast💞
95 watching -
56:25
MentourPilot
1 year agoTITANIC of the Skies! - The Untold Story of Air France 447
39.6K7 -
LIVE
Lofi Girl
2 years agoSynthwave Radio 🌌 - beats to chill/game to
243 watching -
2:07:47
LFA TV
18 hours agoTHE RUMBLE RUNDOWN LIVE @9AM EST
84.7K14